‘బల్లే ని బల్లే’ సాంగ్ కు క్రికెటర్లు జోస్ బట్లర్, చాహల్ చిందులు

  • సమన్వయంతో ఇద్దరూ కలసి డ్యాన్స్
  • ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ధనశ్రీ
  • 10 లక్షల మందికి పైగా వీక్షణ
క్రికెటర్లు వినోదం విషయంలో చాలా స్పీడ్ గా ఉంటారని మరోసారి జోస్ బట్లర్, యజ్వేంద్ర చాహల్ నిరూపించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులైన వీరు.. ధనశ్రీ వర్మ, అపర్ శక్తి ఖురానా తాజా సాంగ్ ‘బల్లే ని బల్లే’ పాటకు స్టెప్స్ వేసి అభిమానులకు ఉత్సాహాన్నిచ్చారు.

రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ధరించే వీరు పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ధనశ్రీ వర్మ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా దీన్ని చూశారు. రాజస్థాన్ రాయల్స్ సైతం తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ చేసింది. 2 లక్షల మందికి పైగా లైక్ కొట్టారు.

జోస్, చాహల్ సమన్వయంతో సింపుల్ గా స్టెప్పులు వేయడాన్ని వీడియోలో చూడొచ్చు. దీనిపై ధనశ్రీ వర్మ, అపరశక్తి ఖురానా స్పందించారు. ‘హహహహ బెస్ట్ రీల్ ఇప్పటి వరకు’’ అంటూ అపరశక్తి ఖురానా కామెంట్ పెట్టారు. ‘నాకు ఎంతో ఇష్టమైన రీల్’ అంటూ ధనశ్రీ వర్మ కామెంట్ చేసింది. (వీడియో కోసం)

Jos Buttler
Yuzvendra Chahal
dance
Balle Ni Balle

More Telugu News